Monday 22 August 2016

గెలుపు 'సింధూ'రం



ల్డ్ ర్యాంకింగ్స్లో రెండ స్థానంలో ఉన్న వాంగ్ హిహాన్కి ఇరవై ఏండ్ల చిన్నది, ఒలంపిక్స్ లో మొదటి సారి అడుగీడిన చిచ్చర పిడుగు చుక్కలు చూపించింది .. ఎనిమిదవ యేటనే తర్ఫీదును మొదలుపెట్టి, కోచింగ్ సెంటర్ చేరుకోవడానికి ప్రతీ రోజు సుమారు 56కి.మీ ప్రయాణాన్ని కొనసాగించి..సమయపాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ.. నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో సైనా నెహ్వాల్ సృష్టించిన సెమిస్ రికార్డ్ ను ఛేదించి..రియో ఒలంపిక్స్ లో అంచనాలున్న అథ్లెట్లంతా ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ.. ఒక తెలుగమ్మాయి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి లేటెస్ట్ ఇండియా న్యూస్ గా నిలిచింది  . ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ భారత్కు రజత పతకం అందించి తన ఆటను  ఒక యజ్ఞంలా తన  కొనసాగిస్తూ, ప్రశాంత వదనంతో మొక్కవోని దీక్షతో రాకెట్ లా దూసుకుపోతున్నపీవీ సింధు’ ( పుసర్ల వెంకట సింధు ) .. పీవీ రమణ, విజయ దంపతులకు జూలై 5, 1995 సింధు జన్మించారు. హైదరాబాద్ వాస్తవ్యురాలైన ఈమె తొలుత మహబూబ్ అలీ అనే వ్యక్తి వద్ద తర్ఫీదు పొంది తదుపరి ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ వద్ద శిష్యరికం చేశారు ఇప్పుడు తెలుగు న్యూస్ లైవ్ లో హాట్ టాపిక్ అయ్యారు. తర్వాత ఎన్నో పోటీల్లో బహుమతులు పొంది 2010 లో నిర్వహించిన ఉబర్ కప్ గెలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దినదిన ప్రవర్దనంగా ఎదిగి ఎన్నో అవార్డులను, రివార్డులను గెలిచిన సింధు పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరింపబడ్డారు. నేడు ఒలంపిక్స్ లో అందరి ఆశలను మోస్తూ దఫా భారత్ కి అందని పతకాన్ని అందించాలనుకుంటున్న సింధు స్థాయికి సులభంగా రాలేదు. చిన్నప్పటి నుండే ప్రతీ రోజు వేకువజామునే 4 గంటలకు నిద్రలేచి ప్రాక్టీసు మొదలుపెడుతూ..దాదాపుగా రోజు మొత్తం కఠిన తరమైన విన్యాసాలు చేస్తూ..ఎన్ని దెబ్బలు తాకినా . . కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎంతటి శ్రమకైనా సిద్దపడే మనస్తత్వం కలదని పుల్లెల చెప్పడం విశేషం. అంతేకాదు, ఎవరిపైనైనా కోపం వచ్చినా..వెంటనే ఆకాశంలో మేఘాల్లా అది కరిగిపోయేదని సింధు స్నేహితులు కొనియాడుతుంటే..పైన గంభీరమైన ప్రదర్శనతో కనిపించే సింధు లోపల సున్నిత మనస్కురాలు ఉందని అనిపించకమానదు. అందుకే, భారత ప్రభుత్వం సైతం సింధుని పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న పీవీ సింధుభవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
పీవీ సింధు కి సంబందించిన ఆసక్తికర విషయాలు :
· సైనా తర్వాత ఒలింపిక్స్లో సెమిస్ చేరిన తొలి భారత మహిళా షట్లర్గా రికార్డ్ సృష్టించింది సింధు.
· పీవీ సింధు తల్లిదండ్రులు సైతం ఆటగాళ్లే అవడం గమనార్హం. సింధు తండ్రికి 2000 సంవత్సరంలో అర్జున అవార్డు ( వాలీబాల్ ) లో రావడం విశేషం.
· 2014 సంవత్సరంలో ఎన్డీ టీవీ ఛానెల్ వారు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా సింధుని ఎంపిక చేశారు.
· 2013 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని సింధు సొంతం చేసుకుంది.
· షట్లర్ ర్యాంకుల్లో ప్రస్తుతం పదో స్థానంలో ఉన్న సింధు అత్యుత్తమంగా తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకుంది

No comments:

Post a Comment