Friday 2 September 2016

టెలికాంలో సం ‘చలనం’ తెచ్చిన జియో





భారత టెలికాం రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ కొత్త నెట్ వర్క్ అయిన రిలియన్స్ జియో ను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే! విడుదలకు ముందే సంస్థ మొత్తం తెలుగు న్యూస్ ఆన్ లైన్ లో ఉండటం విశేషం!. కనీవినీ ఎరగని తక్కువ ధరలతో ప్రపంచపు అతిచవకమైన 4జీ డేటా ఆఫర్లను రిలయన్స్ జియో ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ ఇప్పుడు అందరి నోట్లో హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా వెలువరించిన జియో ప్లాన్ కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వారసులే ప్రతినిధులు కావడం విశేషం. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ (24), కుమార్తె ఈషా సరికొత్త డేటా ప్లాన్ కు రూపకర్తలు. వాళ్లలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమే రిలయన్స్ జియో ప్లాన్. రెండేళ్ల క్రితం రిలయన్స్ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన వీరిద్దరు దీనిపై చాలానే కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది.
డేటా వినియోగం కోసం దేశ యువత సరాసరిన ఎంత డబ్బు ఖర్చు పెడుతోంది.. ఒక నెలలో ఎంత డేటాను ఉపయోగిస్తున్నారు.. అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఆయా గణంకాల ఆధారంగా రిలయన్స్ జియో ప్లాన్ రూపొందించారు. రిలయన్స్ యంగ్ డైరెక్టర్లుగా ఉన్న వీరిద్దరు.. నేటి యువ తరానికి ప్రతినిధులుగా నిలబడగలరన్న నమ్మకాన్ని ముఖేష్ అంబానీ సందర్భంగా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా గత వారం రోజులుగా సంస్థ వారం రోజులుగా తెలుగు బ్రేకింగ్ న్యూస్ గా ఉండటం గమనార్హం.
రిలయన్స్ జియోకి సంబంధించిన కొన్ని విశేషాలు :
వాయిస్ కాల్స్ పై ఛార్జీలు ఉండవు :
జియో నెట్వర్క్లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవు . 4జీ డాటా పై ఇతర నెట్వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10 వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుండటం విశేషం.
ఎంత ఎక్కువ డాటా ఉపయోగిస్తే అంత తక్కువ ఛార్జీ :
ఎంబీకి 5 పైసుల చొప్పున, 1జీబికి రూ.50 మాత్రమే ఛార్జ్ ఉంటుందని ఆయన తెలిపారు. నెలకు 75జీబి కన్నా ఎక్కువ వాడే వారికి రూ.25కే జీబి డాటా లభిస్తుంది
ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ఛార్జీలు లేవు :
జియో ఆఫర్ లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అంటే డిసెంబర్ 31 వరకు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జనవరి 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. పండుగల.. ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ఛార్జీలు ఉండవు.
రోమింగ్ ఛార్జీలు, లోకల్, ఎస్‌‌టీడీ ఛార్జీల్లో తేడాలు ఉండవు :
రిలయన్స్ జియో నెట్వర్క్ను ఉపయోగించుకునే వారికి వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. లోకల్, ఎస్‌‌టీడీ తేడా ఉండదు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్ ఛార్జీలు ఉండవు.
నెల వారీ చందా రూ.1250గా ఉన్న యాప్ సూట్డిసెంబర్ 31 2017 వరకు ఉచితమట! :
డిసెంబర్ 31 2017 వరకు రిలయన్స్ జియో యాప్ సూట్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. యాప్ సూట్ నెల వారీ చందా రూ.1250గా ఉంది. సూట్ లో ఉండే యాప్స్ ద్వారా సినిమాలు, పాటలతో ఇతర ప్రత్యేక సేవలను ఆస్వాదించవచ్చు.
విద్యార్థులకు అద్భుత ఆఫర్ :
రిలయన్స్ జియో విద్యార్థులకు ప్రత్యేకమైన రాయితీలను అందిస్తోంది. విద్యార్థులు తమ గుర్తింపు కార్డును చూపించటం ద్వారా 25 రాయితీని పొందవచ్చు. ఏడాదిలో 10 కోట్ల మంది యూజర్లకు చేరువ కావాలన్నది రిలయన్స్ జియో సంకల్పం

No comments:

Post a Comment