Wednesday 18 May 2016

ఆ కార్లలో ప్రయాణం అంత క్షేమం కాదు : గ్లోబల్ ఎన్సీఏపీ



కారును కొనడం నేటికీ ఒక స్టేటస్ సింబల్ గానే ప్రతీ ఒక్కరు భావిస్తున్నారు. కారు మోడల్ ఏంటి? చూడ్డానికి ఎలా ఉంది? ఆక్యుపెన్సీ ఎంత? ఎంత మైలేజీ వస్తుంది అనే విషయాలే తప్పా.. కారు మన ప్రాణాలకు ఎంత భరోసాను ఇవ్వగలదనే విషయాన్ని దాదాపుగా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే, రోజు రోజుకూ కారు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది.
ప్రపంచంలోనే కార్లు, ఆటో మొబైల్ రంగంలో టాప్ టెన్ ప్లేస్ లో ఉన్న భారత్ కి  గ్లోబల్ ఎన్సీఏపీ ఇచ్చిన నివేదిక మింగుడు పడటం లేదు. దీనికి కారణం లేకపోలేదు. “కార్లకు ఏవైనా ప్రమాదాలు జరిగితేఅవి ఎంతవరకూ తట్టుకొని మనల్ని క్షేమంగా కాపాడుతాయి ఎంత వేగంతో వచ్చిన వాహనం ఢీకొంటే కారు మేరకు నిలబడుతుంది?వంటి విషయాలను ప్రతీ ఒక్కరు కారు కొనే ముందు ఆలోచించాలి. కారు యొక్క సేఫ్టీ మెజర్స్, వాహన చోదకుల రక్షణ ప్రమాణాలకు సంబందించిన పరీక్షలను నిర్వహించే యుకె కి చెందిన  గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూ కార్ ఎసైన్ మెంట్ ప్రోగ్రామ్) సంస్థ తాజా ఫలితాల్లో ఇండియాలో పేరున్న ఎన్నో కార్లు సంతృప్తికర ఫలితాలను ఇవ్వలేదని తేలింది. విషయం బ్రేకింగ్ హెడ్లైన్స్ గా మారింది. అంతే కాదు మనం ఎంతో గొప్పగా, స్టేటస్ లెవల్ గా ఫీల్ అయ్యే ఎన్నో ఫేమస్ మోడల్ కార్లు సైతం సున్నా మార్కులు తెచ్చుకొని అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఇప్పుడు  బ్రేకింగ్ న్యూస్ అందర్నీ షాక్ కి గురి చేస్తుందిలేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం  రెనాల్ట్ క్విడ్ కారును మూడు అంచెల్లో సదరు సంస్థ  పరీక్షించగామూడు సార్లూ అది ఫెయిల్ అవడం గమనార్హం. అంతే కాదు  రెనాల్ట్ క్విడ్ కార్లో  ఎక్కిన వారు ప్రమాదాల సమయంలో ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేదని ఫలితాల్లో వెల్లడైందని ఎన్సీఏపీ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు సీటు ఫ్రంట్ లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ మనకు రక్షణగా ఉంటాయన్న విషయం తెలిసిందే! అయితే, భారత్ లో తయారవుతున్న ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లు  సైతం ప్రాణాలు కాపాడే నాణ్యతతో తయారవడం లేదని  ఎన్సీఏపీ సంస్థ పేర్కొంది.
ఒక్క రెనాల్ట్ క్విడ్ మాత్రమే కాదుమహేంద్రా స్కార్పియోమారుతి సుజుకి సెలేరియోఈకోహ్యుందాయ్ ఇయాన్ లు సైతం తమ పరీక్షల్లో ఘోరంగా విఫలమయ్యాయని ఎన్సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ..ఇండియాలో లగ్జరీ, సూపర్ కార్లుగా పేర్కొనే మోడళ్లన్నీ దాదాపుగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను హరించేవేనని, ఏమాత్రం దృఢత్వం వాటిల్లో లేదనిఎయిర్ బ్యాగులు ఉన్నా అవి అనుకున్న స్థాయిల్లో ఉపయుక్తంగా లేవని ఆయన తెలిపారు.
గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్ లో ఫెయిల్ అయిన కార్ల ఖరీదు ( ప్రస్తుత భారత్ మార్కెట్ రేట్ ప్రకారం 




కారు మోడల్


ఖరీదు ( లక్షల్లో )




మహింద్రా స్కార్పియో


9.39 నుండి 14.38




మారుతి సుజుకీ సేలేరియో


4.03 నుండి 5.90




హ్యుండాయి ఇయాన్


3.25 నుండి  4.39




మారుతీ సుజుకీ ఈకో


3.21  నుండి 4.25




రినాల్ట్ క్విడ్


2.62  పైనా



ఇప్పటికే ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం కార్ల వాటాలో ఒక వంతు ను చైనా, అమెరికా దేశాలు భర్తీ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఆటో మొబైల్ రంగంలో ఆరో స్థానంలో ఉన్న భారత్ 2020 నాటికి నాలుగో స్థానాన్ని ఆక్రమించాలని తలపోస్తుంది. అయితే, ఇటువంటి ఫలితాలను నమోదుచేస్తున్న తరుణంలో భారత్ 2020 నాటికి కాదు కదా తర్వాత కూడా తన స్థానాన్ని మెరుగుపరచుకోలేదని నిపుణులు సెలవిస్తున్నారు.
ఆటో మొబైల్ రంగంలో టాప్ -5 దేశాలు :




దేశం


ఉత్పత్తి ( కోట్లలో )




చైనా


2.450




యుఎస్ఎ


1.210




జపాన్


0.927




జర్మనీ


0.603




సౌత్ కొరియా


0.455


No comments:

Post a Comment