Wednesday 11 May 2016

ఆకాశమే హద్దుగా . . . సాగుతున్న సాంకేతిక భారత్ (నేషనల్ టెక్నాలజీ డే ( మే 11 ) సందర్బంగా )




వేల ఏళ్ల కిందటేసున్నాను ప్రపంచానికి అందించిన దేశం భారత్ . అదే లేకపోతే ప్రస్తుత విజ్ఞానం, ప్రగతి సాధ్యమయ్యేవా?. . సున్నా లేనిది ప్రపంచ దేశాలకు చక్రం ఎక్కడిది? చక్రం లేని జీవిత చక్రంలో టెక్నాలజీ మాటెక్కడిది? సైకిల్ మీద రాకెట్ను తీసుకెళ్లి ప్రయోగించిన స్థాయి నుంచి ప్రారంభమైన మన అంతరిక్ష సాంకేతిక ప్రయోగ మజిలీ ..వాణిజ్యపరంగా అమోఘ విజయాలు అందించే స్థాయికి చేరడం భారత జాతికి గర్వకారణం. ఐదు దశాబ్దాల చరిత్రలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వంద మైలురాళ్లను దాదాపు 120 పై చిలుకు ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. అమెరికా, రష్యా.. ఇటీవలి కాలంలో చైనా మరికొన్ని దేశాలు.. అంతరిక్ష రంగంలో అద్భుత విజయాల్ని సాధిస్తూ టెక్నాలజీ రంగంలో మేమే అగ్రగాములమని జబ్బలు చరుస్తున్న వేళ.. ప్రపంచమే ముక్కున వేలేసుకునేలా అంతరిక్షంలో అతి తక్కువ ఖర్చుతో అరుదైన విజయాల్ని సొంతం చేసుకుంటోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. విజయం సొంతం ఐనప్పుడు ఎన్నడూ ఇస్రో విర్రవీగలేదు అలా అని వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎప్పుడూ క్రుంగిపోలేదు. ఇస్రో కుటుంబానికి తమ మొదటి ప్రస్థానం ఎంటో తెలుసు. భారత జాతి సాంకేతిక రెపరెపలు విశ్వ వినువీదుల్లో విహరించాలన్న దృఢ నిశ్చయం తో మొదలైన వారి ప్రయాణం ఆరంభంలో ఎటువంటి వాహన సౌకర్యాలు లేకపోయినా సైకిల్ మీద రాకెట్ను తీసుకెళ్లిన జ్ఞాపకాలు..మరుగుదొడ్లను సైతం సమాచార కేంద్రాలుగా ఉపయోగించిన రోజులను ఎన్నటికీ మరువలేరు . అందుకే, అంత విపత్కర పరిస్తితుల్లో నుండి తమ నడకను సాంకేతిక అధ్యాయంగా ప్రారంభించారు గనుకనే రోజున సమస్త భారత జాతినేషనల్ టెక్నాలజీ డేఅని సంవత్సరంలో ఒక రోజుని గర్వంగా జరుపుకోగలుగుతుంది.
అలుపెరుగని నీ పయనం విజయాలకు నిలయం :


తగిన ఆర్ధిక స్తోమత, సరైన వనరులు లేని తొలి రోజుల్లోనే 'ఆర్యభట్ట' ఉపగ్రహానికి అంకురార్పణ చేసి సాంకేతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది ఇస్రో . 1975, ఏప్రిల్ 19 సోవియట్ రష్యా వారి 'ఇంటర్ కాస్మోస్' రాకెట్ ద్వారా రోదసిలో కక్ష్యా ప్రవేశం చేసిన ఆర్యభట్టతో భారత్ అంతరిక్ష స్వప్నం నెరవేరింది. ఇలా మొదలైన జైత్ర యాత్ర ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసి.. “40 ఏళ్ల కిందటే చంద్రుడిపైకి అనేక దేశాలు యాత్రలు నిర్వహించాయి. ఇప్పుడు ఇస్రో కొత్తగా చంద్రయాన్ ప్రయోగంతో వెలగబెట్టేదేంటి?” అని వ్యంగ్యంగా కూసిన నోళ్లను మూయిస్తూ..ఇప్పటి వరకు చేసిన జాబిల్లి ప్రయోగాలు కల్లబొల్లి అరకోర ఫలితాలనే ఇచ్చాయి. కానీ, మా ప్రయోగం అలాంటిది కాదు అని చెబుతున్నట్లు ఇంతవరకూ దేశమూ, ప్రయోగమూ కనిపెట్టని జాబిల్లి ఉపరితలంపై నీటికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను మన ఉపగ్రహమైన చంద్రయాన్ తొలిసారిగా కనిపెట్టి శభాష్ అనిపించుకుంది . అంతేనా, తర్వాత మార్స్ పై సైతం మామ్ పేరుతో తన జైత్రయాత్రలను ఇస్రో సాంకేతిక ప్రపంచంలో కొనసాగించింది. మొన్నటికి మొన్న ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1జీ స్వదేశీ నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగ విజయంతో తన విజయ దుందుభికి ఎవరూ సాటి రారని మరోమారు ఇస్రో నిరూపించింది.

సవాళ్లతో పాటూ పరిష్కారమూ ఉంది :
నిపుణుల కొరత లేని మన దేశంలో మిగతా దేశాలతో పోల్చితే ప్రయోగాలకు కావలసిన ఆర్ధిక ఆలంభన అతి తక్కువ అనేది కాదనలేని సత్యం. ‘కోట్లకు కోట్లు ఖర్చు చేసి అంతరిక్షంపై ప్రయోగాలు చేయడం కన్నా.. పేదలకు తిండి పెట్టే కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆకలి చావులు ఉండవు కదా! ’ అనే రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్న విమర్శలు తరుచూ వింటూనే ఉన్నాం. కారణం చేతనే ప్రభుత్వాలు సాంకేతిక రంగానికి నిధులను కేటాయించడం లేదని పూర్తిగా చెప్పలేం గానీ, విధంగానైతేనేమీ రంగానికి కేటాయిస్తున్న ప్రోత్సాహకాలు తక్కువనే చెప్పాలి. వున్న వనరుల్లోంచే అత్యద్భుత విజయాల్ని సొంతం చేసుకోవడంపై ఇస్రో దృష్టిపెడుతూ వస్తోంది. ఐతే, ఇదే సరళి భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే వివిధ దేశాలు తమ ఉపగ్రహాల్ని ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపుతాయి. దీనికి కారణం అతి తక్కువ ఖర్చుతో ఇస్రో విజయవంతంగా అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించడమే. ఇప్పటికే పలు విదేశీ ఉపగ్రహాల్ని ఇస్రో అంతరిక్షంలోకి దిగ్విజయంగా పంపిన విషయం విదితమే ! విధంగా వివిధ దేశాల ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి విదేశాల నుంచి ఆదాయం సముపార్జించి, ఇతరులు కేటాయించే నిధులపై ఆధారపడకుండా సర్వసత్తాకగా ఇస్రో మారే రోజు త్వరలోనే రానుందన్నది నిజం


ముళ్ల బాటతో మొదలైన భారత సాంకేతిక ప్రయాణం ఇప్పుడు ప్రపంచ దేశాలచే జేజేలు పలికించుకునే స్థాయికి చేరింది. ఇది ఒక్కరోజులో సాధ్యపడింది కాదు! అంతరిక్ష ప్రయోగాలే సాంకేతికత అభివృద్దికి ఆయువుపట్టు అని గమనించిన నెహ్రూ, హోమీ బాబా, విక్రంసారాభాయ్ త్రయం కన్న కలల వారదులపై ఎందరో తమ నిరంతర కఠోర శ్రమనే పునాదులుగా మార్చి వారి అవిరామ త్యాగాలే దేశ టెక్నాలజీకి ఊపిరులుగా ఊది మన దేశ గౌరవాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. వారి ఫలాలే ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్న టెక్నాలజీకి కారణం. శుభ సమయాన వారందరినీ స్మరించుకోవడం మన కర్తవ్యం.


For telugu news online please Download NewsDistill app from Google play store

No comments:

Post a Comment