Showing posts with label Telugu news. Show all posts
Showing posts with label Telugu news. Show all posts

Thursday, 15 September 2016

వ్యాయామం . . ఇది జీవనాధారం



వ్యాయామాలు నిత్యం చేస్తే ఒంటికి చాలా మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. శరీరాకృతి కూడా అందంగా తయారవుతుంది. కానీ తాజాగా వెలువడిన అధ్యయనాల్లో వ్యాయామం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో లాభాలున్నాయని తేలడం విశేషం ఇప్పుడు విషయం తెలుగు బ్రేకింగ్ న్యూస్ గా మారింది
ఫిట్ నెస్ : రోజూ క్రమం తప్పకుండా జిమ్ చేయడం వల్ల బాడీ పెరగడమే గాక, మరింత ఫిట్ గా తయారవుతుంది. అప్పుడు మీ శరీర సౌష్టవంతో మీ పై మీకు మరింత ఆత్మ విశ్వాసం పెరుగుతుందంట!
బరువు పెరుగొచ్చు : ఉన్నపళంగా జిమ్ చేయడం మానేస్తే, ఒక్కసారిగా అత్యధిక బరువు పెరిగే అవకాశముంది.
ఆహారలవాట్లు మారడం : అనుకోకుండా జిమ్ చేయడం మానితే మన రోజువారీ ఆహారపు అలవాట్లు సైతం మారే అవకాశం ఉంది. ఇందు మూలంగా ఆరోగ్యంలో పెను మార్పులు సంభవించే అవకాశముంది
జిమ్ ని ఏకబిగిన మానేయడం వల్ల గుండెతో పాటు మానసికంగా కూడా ప్రశాంతతను కోల్పోయే అవకాశమున్నట్లు కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లు ఉన్నపళంగా మానేస్తే చాలా నష్టమని నిపుణులు చెబుతున్నారు . నష్టం ఎప్పుడు మొదలవుతుందో ? రోజుల వారీగా చూసినట్లయితే ఆన్ లైన్ తెలుగు న్యూస్ లో కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి... 
రెండు రోజుల తర్వాత! : పెద్ద నష్టమేం ఉండదు. వ్యాయామంతో అతిశ్రమకు గురైన కండరాలు అవసరమైన విశ్రాంతి తీసుకుంటాయి. గాయాలు, నొప్పులుంటే మరమ్మతు చేసుకుంటాయి. తర్వాతి వ్యాయామం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తాయి.
వారం తర్వాత.. : మామూలుకంటే శరీరం కాస్త పటుత్వం కోల్పోయినట్టు అనిపిస్తుంది. కండరాల పోగులు కుంచించుకుపోతాయి. కానీ ఇది పెద్ద ఆలస్యమేం కాదు. మీరు మళ్లీ వ్యాయామానికి వెళ్లగలిగితే.. ఇబ్బందిలేదు.
రెండువారాలయ్యాక.. : వ్యాయామం చేసినప్పటి చురుకుదనం తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది! మామూలు మెట్లెక్కినా కాళ్లు పీకుతాయి. పెద్దగా శ్రమించలేరు. మన కణాలకు శక్తినిచ్చే మైటోకాండ్రియాల సంఖ్య తగ్గడం ఇందుకు కారణం!
నెల పూర్తయ్యాక.. : మహిళలకు కండరాల రాశి తక్కువగానే ఉంటుంది. అవి వ్యాయామంతో చక్కటి రూపం సంతరించుకుంటాయి. ఇప్పుడవి తగ్గుతాయి. అనవసర కొవ్వు పేరుకోవడం మొదలవుతుంది. నీటి రూపంలో వ్యర్థాలు పేరుకుంటాయి.
కొన్ని నెలలైతే.. : వ్యాయామం చేసినప్పటి చురుకుదనం గుండెకు ఉండదు. కొట్టుకోవడానికి ఎక్కువ శ్రమిస్తుంది. వూపిరితిత్తులు ఒకప్పటి కంటే తక్కువ ప్రాణవాయువుని గ్రహిస్తాయి. ఫలితంగా చిన్నపని చేసినా తీవ్రంగా అలసిపోతారు. నిద్రలేమి వేధిస్తుంది.
ఏడాదయ్యాక.. : కొవ్వుశాతం పెరుగుతుంది. కండరాల రాశి పూర్తిగా తగ్గుతుంది. జీవక్రియ(మెటబాలిజమ్‌) మందగిస్తుంది. రక్తపోటు, మధుమేహం, ట్రైగ్లిజరాయిడ్ల సమస్యలకు చేరువగా ఉంటారు.

Wednesday, 6 July 2016

భార్యను చంపి ముక్కలు చేసి.. కాల్చేసి..ఆ తర్వాత దొరికి..






అగ్ని సాక్షిగా పెళ్ళిచేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఎంత కిరాతకంగా అంటే..పరులెవరూ ఊహించలేనంత ... భార్యను చంపడంతోనే ఆగక శవాన్ని  ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తర్వాత తప్పించుకునే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంత కిరాతకంగా చంపడానికి బలమైన కారణం ఏమైనా ఉందేమో అని అనిపించవచ్చు.. ఇంతటి దుర్మార్గానికి తెగబడడానికి నిందితుడికి  కోపం తెప్పించడమే ఇల్లాలు చేసిన తప్పు. చిన్న ఆవేశానికే ఏడడుగులు నడిచిన సతిని మట్టుపెట్టిన ప్రబుద్దుని గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.. 04 జూలై 2016 సోమవారం రాత్రి  తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్పల్లి సమీపంలో భయానక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్లోని పద్మారావునగర్ ప్రాంతానికి చెందిన రూపేశ్కుమార్ షేర్ మార్కెట్లో బాగా నష్టపోయాడు. క్రమంలో ఆదివారం రాత్రి భార్య సింతియా(30)తో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపాడు. శవాన్ని ముక్కలుగా చేసి పెద్ద బ్యాగులో ఉంచాడు. కూతురు సానియా(8)కు అనుమానం రాకుండా సోమవారం ఉదయం పాఠశాలలో విడిచిపెట్టాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక  బ్యాగులోని చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురుతో కలసి శంషాబాద్ శివారులోని మదన్పల్లికి రాత్రి ఏడు గంటల సమయంలో ఫోర్డ్ కారులో వచ్చాడు. బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రీన్సిటీ వెంచరులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు ఆపాడు. కూతురును కొద్ది దూరంలోనే దించేసి కారును ముందుకు తీసుకెళ్లి అందులోని బ్యాగును కిందకు దించాడు. బ్యాగులోని భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. అక్కడికి వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి బయలుదేరాడు. అక్కడే విధి నిందితుడి పథకాన్ని కాల్చి వేసింది. మదన్పల్లి శివారులోకి వెళ్లగానే అక్కడ బురదలో కారు ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. కంగారులో ఉన్న రూపేశ్కుమార్ పొంతన లేని సమాధానాలు చెప్పడం,దూరంగా మంటలు కనిపిస్తుండడంతో స్థానికులు వెంటనే శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోతున్న మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నిందితుడితోపాటు అతడి కూతురును ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ ఏసీపీ అనురాధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉండగా సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.


Download Newsdistill App for all latest news on your mobile.