Showing posts with label telugu news papers app. Show all posts
Showing posts with label telugu news papers app. Show all posts

Wednesday, 6 July 2016

భార్యను చంపి ముక్కలు చేసి.. కాల్చేసి..ఆ తర్వాత దొరికి..






అగ్ని సాక్షిగా పెళ్ళిచేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఎంత కిరాతకంగా అంటే..పరులెవరూ ఊహించలేనంత ... భార్యను చంపడంతోనే ఆగక శవాన్ని  ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తర్వాత తప్పించుకునే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంత కిరాతకంగా చంపడానికి బలమైన కారణం ఏమైనా ఉందేమో అని అనిపించవచ్చు.. ఇంతటి దుర్మార్గానికి తెగబడడానికి నిందితుడికి  కోపం తెప్పించడమే ఇల్లాలు చేసిన తప్పు. చిన్న ఆవేశానికే ఏడడుగులు నడిచిన సతిని మట్టుపెట్టిన ప్రబుద్దుని గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.. 04 జూలై 2016 సోమవారం రాత్రి  తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్పల్లి సమీపంలో భయానక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్లోని పద్మారావునగర్ ప్రాంతానికి చెందిన రూపేశ్కుమార్ షేర్ మార్కెట్లో బాగా నష్టపోయాడు. క్రమంలో ఆదివారం రాత్రి భార్య సింతియా(30)తో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపాడు. శవాన్ని ముక్కలుగా చేసి పెద్ద బ్యాగులో ఉంచాడు. కూతురు సానియా(8)కు అనుమానం రాకుండా సోమవారం ఉదయం పాఠశాలలో విడిచిపెట్టాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక  బ్యాగులోని చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురుతో కలసి శంషాబాద్ శివారులోని మదన్పల్లికి రాత్రి ఏడు గంటల సమయంలో ఫోర్డ్ కారులో వచ్చాడు. బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రీన్సిటీ వెంచరులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు ఆపాడు. కూతురును కొద్ది దూరంలోనే దించేసి కారును ముందుకు తీసుకెళ్లి అందులోని బ్యాగును కిందకు దించాడు. బ్యాగులోని భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. అక్కడికి వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి బయలుదేరాడు. అక్కడే విధి నిందితుడి పథకాన్ని కాల్చి వేసింది. మదన్పల్లి శివారులోకి వెళ్లగానే అక్కడ బురదలో కారు ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. కంగారులో ఉన్న రూపేశ్కుమార్ పొంతన లేని సమాధానాలు చెప్పడం,దూరంగా మంటలు కనిపిస్తుండడంతో స్థానికులు వెంటనే శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోతున్న మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నిందితుడితోపాటు అతడి కూతురును ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ ఏసీపీ అనురాధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉండగా సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.


Download Newsdistill App for all latest news on your mobile.