Monday 13 June 2016

బఫెట్ భలే స్కెచ్

వారెన్ బఫెట్ – షేర్ మార్కెట్వ్యాపార రంగంలో ఈ పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ షేర్ మార్కెట్ కదలికల్ని పసిగట్టి తదనుగూణంగా వివిధ సంస్థల్లో పెట్టుబడులను సమయానుకూలంగా పెడుతూ బ్రేకింగ్ న్యూస్ లకు కేంద్ర బిందువుగా ఉంటాడని  ఈయనకు పేరుంది. ప్రతీ యేటా ప్రపంచ టాప్ – 5 ధనవంతుల జాబితాలో తిష్టవేసే ఈయన తాజాగా వేస్తున్న బిజినెస్ పాచిక  మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రతీ రోజు షేర్ మార్కెట్ బిజినెస్ లేటెస్ట్ అప్డేట్స్లో ముందుగా ఉండే ఈయన  ఈ ఆటలో పావుగా ఉపయోగిస్తుంది ఏదో చిన్న కంపెనీ ఐతే ఇంత చర్చ ఉండేది కాదేమో! కానీఈ సారి ఆయన వినోద రంగంలో గుత్తాదిపత్యం సొంతం చేసుకోవడానికి వదులుతున్న అస్త్రం యాపిల్”.
సెల్‌ఫోన్‌ రంగంలో  యాపిల్‌ సృష్టించిన  విప్లవం అంతా ఇంతా కాదు. ఆ ఫోన్ ఒక స్టేటస్ సింబల్ గా భావించిన రోజులు ఉన్నాయంటే యాపిల్ హవా ఏమిటో అర్డంచేసుకోవచ్చు. కానీపరిస్థితి మారింది. ఇప్పుడు అనేక ఇతర బ్రాండ్‌ల పోటీని అంతగా తట్టుకోలేని పరిస్థితికి యాపిల్ సంస్థ వచ్చిందని గత కొన్నేళ్లుగా సంస్థ సాగిస్తున్న అమ్మకాల సరళిని చూస్తే తెలుస్తుంది. యాపిల్‌ కంపెనీ ఇక దివాలా తీస్తుందనే వదంతులూ మార్కెట్‌లను గతంలో ముంచెత్తాయి.ఇది అప్పట్లో ట్రెండింగ్ న్యూస్ గా హాల్ చల్ ను సృష్టించడం విశేషం. సరిగ్గా ఆ సమయంలోనే బఫెట్ యాపిల్‌ షేర్‌లను అనేకంగా ( ఎన్ని షేర్స్ కొన్నది వెల్లడించలేదు ) కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా ప్రస్తుత గడ్డు పరిస్థితిని యాపిల్ ఎదుర్కొని మార్కెట్ లో ఆదాయాన్ని ఆర్జించే విధంగా తయారవడానికి అత్యంత లాభసాటిగా సాగుతున్న  వినోదరంగంలోకి దిగాలని సదరు సంస్థకు వారెన్ దిశా నిర్దేశం చేశాడని వినికిడి. ఇప్పటికేమ్యూజిక్‌’, ‘సెట్‌బాక్స్‌’ రంగాలలోకి దిగిన యాపిల్‌ కంపెనీఇప్పుడు వినోద రంగంలో పేరెన్నికగన్న సంస్థలతో సంప్రదింపులను జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మునుగిపోతున్న యాపిల్ పడవను షేర్స్ పెట్టి మరీ కాపాడాడని బఫెట్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నా..సరిగ్గా గమనిస్తేవారెన్ వ్యూహం మరోలా ఉందన్నది సులువుగానే అర్ధం చేసుకోవచ్చు.. వినోదరంగంలో ప్రవేశించాలని యాపిల్ కి హితబోధ చేసిన వారెన్ .. టైమ్‌ వార్నర్‌ కంపెనీతో గానీఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతున్న నెట్‌ప్లెక్స్‌ సంస్థల ద్వారా గానీ వినోద రంగంలోకి అడుగీడమని  సూచించాడట! ఆయన నిర్దేశనం మేరకు యాపిల్ సంస్థ ఆయా కంపెనీలతో చర్చలను ప్రారంభించింది. అమెరికాలో వినోదరంగంలో ప్రధాన పోటీ నెట్‌ప్లెక్స్‌ సంస్థటైమ్‌ వార్నర్‌ కంపెనీకి మధ్యన ఉంటుంది. వార్నర్‌ బ్రదర్స్‌ స్టూడియోహెచ్‌బిఓ ఛానల్‌ల మాతృ సంస్థ అయిన టైమ్‌ వార్నర్‌ కంపెనీలో  బఫెట్ కి ఇంతకు ముందే పెట్టుబడులున్నాయి. అంటేఇపుడు వినోద రంగంలో అడుగీడుతున్న యాపిల్ తన కంపెనీ టైమ్‌ వార్నర్‌తో కలిస్తే ప్రధాన పోటీదారైన నెట్‌ప్లెక్స్‌ ను దాటి ముందంజలో ఉండొచ్చని  పథకం వేసాడు. ఒక వేళ  యాపిల్ తన కార్యాచరణను నెట్‌ప్లెక్స్‌ తో కలిసి చేసినా వారెన్ కే లాభం. ఇప్పటికే టైమ్‌ వార్నర్‌ తో దూసుకెళ్తున్న తను.. యాపిల్ ద్వారా నెట్‌ప్లెక్స్‌ కంపెనీపై సైతం పరోక్షంగా అజమాయిషీ చేయొచ్చు. అంటేఏ విధంగా చూసినా వారెన్ వేసిన స్కెచ్ తననింకా రిచ్ చేస్తున్నట్లే కదా !
జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న మార్కెట్ నిపుణులు బఫెట్ ఆలోచనకు సలాం చేయకుండా ఉండలేకపోతున్నారు. నిజమే కదా!


వారెన్ బఫెట్ నమ్మే వ్యాపార సూత్రాలు :
1. తెలివిగా ఖర్చు చేయండి  : మీకు అవసరం లేని వస్తువులను కూడా కొనుక్కుంటూపోతే ఏదో ఒకరోజు డబ్బులకోసం మీకిష్టమైన వస్తువును కూడా అమ్ముకోవాల్సి వస్తుంది.
2.
ఊహించలేని పరిణామాల కోసమూ ఆదా చేయండి:  ఖర్చు పెట్టాక మిగిలింది ఆదా చేయడం కాదుపొదుపు చేశాక మిగిలింది ఖర్చు చేయాలి.
3.
దీర్ఘకాలిక వ్యూహంసహనం ఉండాలి : నైపుణ్యతశక్తి సామర్థ్యాలున్నా కొన్ని పనులు పూర్తికావడానికి వేచిచూడక తప్పదు. బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లికి నవమాసాలు పడుతుంది. అంతేగాని తొమ్మిది మంది గర్భవతుల ద్వారా ఒకనెలలో బిడ్డను భూమి మీదికి తీసుకురాలేం కదా.
4.
రుణాలకు వీలైనంత దూరంగా ఉండాలి : చాలామంది అధికంగా మద్యం సేవించడంరుణాలు తీసుకోవడం మూలాన జీవితంలో వైఫల్యం చెందడం గమనించాను. ఈ ప్రపంచంలో అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలివిగల వారైతే అప్పు చేయకుండానే చాలా డబ్బు సంపాదించొచ్చు.
5.
నష్టాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : చేస్తున్న పనిలో మీకు తెలియకుండా సంభవించేదే రిస్క్. దాన్ని ఎదుర్కోవాలి. రిస్క్ తో పాటు  నిజాయితీ చాలా ఖరీదైందిచిల్లర గాళ్ల నుంచి దాన్ని ఆశించకు.
వారెన్ బఫెట్ షేర్స్ ఉన్న మరికొన్ని ప్రధాన కంపెనీలు :
క్రాఫ్ట్ హైజెన్ కంపెనీకొకొకోలాఐబిఎంఅమెరికన్ ఎక్స్ ప్రెస్ పిలిప్స్వాల్ మార్ట్మూడీస్చార్టర్ కార్పోరేషన్బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్మాస్టర్ కార్డ్,జాన్సన్ & జాన్సన్ట్వంటీ ఫస్ట్ సెంచరీలీ ఎంటర్ప్రైజెస్ మొదలగునవి .

No comments:

Post a Comment