Monday 13 June 2016

ప్రాణాలు తీస్తున్న కాస్మొటిక్ సర్జరీలు

రోజురోజుకీ సౌందర్య చికిత్సలపై నేటి యువతరం ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఆయా సెంటర్ల నిర్వాహకులకు కాసులను కురిపిస్తున్నాయిఒక్క భారత దేశంలోనే ప్రతీఏటా సుమారు 460 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క కాస్మోటిక్ సర్జరీ ల పేరుతో జరగడాన్ని చూస్తే  అది ఎంతగా పెట్రేగి పోతుందో అర్ధమవుతుందిమొన్నటికి మొన్న ఎత్తు పెరగాలనే అత్యుత్సాహంతో హైదరాబాద్ కి చెందిన నిఖిల్ కాళ్ళకి ఇల్ జర్వ్ చికిత్స చేయించుకొని నడవరాని స్థితిలోకి చేరిన ఘటన బ్రేకింగ్ న్యూస్ గా మారింది. ఆ సంఘటన మరువకముందే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చెన్నై కి చెందిన ఓ మెడిసిన్ స్టూడెంట్ బట్టతల పోవడానికి హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సర్జరీ చేయించుకొని మృత్యువాత పడటం కలవరపరుస్తుందిచెన్నైకి చెందిన సంతోష్‌(22) మెడిసిన్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడుఅతనికి బట్టతల ఉందిఅది చూసి అందరూ నవ్వుతూ హేళన చేస్తారేమో అని  భావించి గత నెలలో రూ.73 వేలు చెల్లించి హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సర్జరీ చేయించుకున్నాడుమొత్తం 1,200 వెంట్రుకలను తల భాగంలో జొప్పించడానికి 10 గంటల పాటు ఇద్దరు వైద్యులు ? ) సర్జరీ చేశారుసర్జరీ అయిన తర్వాత అనుకోకుండా సంతోష్‌కి తీవ్ర జ్వరం వచ్చి మూడో రోజే చనిపోయాడువైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు సంతోష్ తల్లిదండ్రులుజరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగాసంతోష్ కి సర్జరీ చేసిన  హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ సెంటర్‌కు కేవలం హెయిర్‌ సెలూన్ పేరుతో మాత్రమే లైసెన్స్‌ ఉందనీ.. దాని గడువు కూడా రెండు నెలల క్రితమే అయిపోయిందని తెలిపారుప్రస్తుతానికి అధికారులు సెంటర్‌ను సీజ్‌ చేసి స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ నడుపుతున్న యాజమాన్యానికి నోటీసులు పంపింది.ఖననం చేసిన సంతోష్‌ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌ మార్టం నిమిత్తం తరలించారుహెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయిన సంతోష్ ఉదంతం పై సర్వత్రా చర్చ జరుగుతుందికనీస ప్రమాణాలు పాటించని కాస్మోటిక్ సెంటర్లపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుందిఅందం మోజులో పడి నిండైన జీవితాన్ని యువత బలి చేసుకోవోద్దని పలువురు వైద్యులు సూచిస్తున్నారు  నేపథ్యంలో ..

నిపుణుల పర్యవేక్షణలో చేయించుకోవలసిన కొన్ని సర్జరీల వివరాలు :
బోటోక్స్ సర్జరీ : ఈ తరహా చికిత్సలు ముఖ్యంగా సినిమా తారలుసెలబ్రిటీస్  తమ ముఖంపై ఉన్న ముడతలు వగైరా వంటి వాటిని తొలగించుకొనుటకు ప్రధానంగా చేయించుకుంటారుఈ చికిత్స వికటిస్తే ఆయా ముఖ కండర భాగాలు పక్షవాతానికి గురయ్యే ప్రమాదముంది.
కెమికల్  పీల్స్ : ముఖంపై వయస్సు వల్ల వచ్చే స్పాట్స్ కనబడకుండా ఉండటానికి ఈ చికిత్సను చేయించుకుంటారుఈ చికిత్స ఉపయోగించే కెమికల్స్ సరైన మోతాదులో ఉపయోగించనట్లయితే చర్మం కాలిపోయే ప్రమాదముంది.
ఫేస్ లిఫ్ట్ సర్జరీ : కళ్ళుగవదదవడ క్రిందనున్న చర్మం వదులుగా వేలాడుతూ ఉన్న వాళ్ళు ఈ తరహా చికిత్సలు చేయించుకుంటారుచికిత్స జరుగునప్పుడు ఏదైనా పొరపాటు జరిగినట్లయితేఇన్ఫెక్షన్ తో పాటు రక్తం కారడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.
రైనో ప్లాస్టి : ఈ తరహా శస్త్ర చికిత్సను సాధారణంగా 25-30 సంవత్సరాల మధ్య వయస్కులు చేయించుకుంటారుఈ చికిత్స ప్రధానంగా ముక్కు ఆకారంలో మార్పులకు సంబందించినదిగా సాగుతుందిసర్జరీ సరిగా జరగనట్లయితేముక్కు రంద్రాలుశ్వాస సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ : బట్టతల ఉన్నవారు జుట్టు కోసం ఈ చికిత్స చేయించుకుంటారుచికిత్స సమయం దాదాపు నుండి గంటలుగా ఉంటుందిచికిత్సా సమయం పెరిగితే ఇన్ఫెక్షన్ కి గురయ్యే ప్రమాదం ఉంది.  ఇన్ఫెక్షన్ తో పాటు రక్తం కారడంమచ్చలుతలపై గడ్డలవడం జరిగవచ్చు.  
సృష్టిలో ఉన్న ప్రతీ ఒక్కరూ అందంగా  ఆకర్షణ గొలిపే పరిపూర్ణులుగా ఉన్నారని చెప్పలేముఅది చూసే కళ్ళనుమనసులను బట్టి ఉంటుందిఅందం అనేది మనసుకుసంబందించినదే గానీశరీరానికి కాదుఅందుకేబాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం గొప్పదంటారుయువత ఇప్పటికైనా  సత్యాన్ని గమనిస్తే తమ పండంటి జీవితాన్నికాపాడుకున్నవారవుతారు.

No comments:

Post a Comment