Monday 13 June 2016

బాల్యం బలి



దేశం అభివృద్ది సాధించాలంటే ప్రాథమికంగా దేశంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపాలి. పేదరికం పోవాలంటే దేశంలోని పౌరులందరూ అక్షరాస్యులుగా మారాలి. నేటి బాలలే రేపటి పౌరులు“ ఆ భావి భారత పౌరుల భవిత.. బాల కార్మిక విష చట్రంలో నలిగిపోతుంది - నేడు దేశంలో అసంఘటిత రంగంలో పెరిగిపోతున్న బాల కార్మికుల సంఖ్యను రూపు మాపి వారందరికీ అందమైన బాల్యాన్ని అందిస్తూనే అక్షర ఫలాలను చేరవేస్తే అఖండ భారతావనిలో పేరుకుపోయిన పేదరికాన్ని తరిమికొట్టొచ్చు. అందుకేభారత దేశంలో పేదరికం వలన బాల కార్మిక వ్యవస్థబాల కార్మిక వ్యవస్థ వలన నిరక్షరాస్యతనిరక్షరాస్యత వలన పేదరికం ఇలా ఒకదాని ఆధారంగా మరొకటి చక్రబంధమై రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నదిఅని అమెరికాకు చెందిన యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ( యునిసెఫ్ ) 1996 లో ఓ నివేదికలో పేర్కొంది.
నేడు ప్రపంచంతో పాటు భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో బాలకార్మిక వ్యవస్థ ముఖ్యమైనది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మన సమాజంలో నేటికి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికంనిరక్షరాస్యతతక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చుననే  యాజమాన్య దోపిడి ఆలోచన పెరిగిపోవడంతల్లిదండ్రుల పెంపకంలో లోపాలువివక్షకుల అణచివేతలింగ అణచివేతచెడు స్నేహాలుఅశక్తత ఇలా అనేక కారణాల వలన బాలలు పని మనుషులుగానూ బాల నేరస్థులుగానూ సెక్స్ వర్కర్లుగానూ  మార్చబడి దోపిడికి గురి అవుతున్నారు. పర్యవసానంగా ఇట్టి కారణాలు దరిమిలా బాల కార్మిక వ్యవస్థ పుట్టడానికి దోహదం చేస్తున్నాయి. నేటికి మన దేశ జనాభాలో 40 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. దీనికి కారణం నిరక్షరాస్యతతో కూడిన పేదరిక బాలకార్మిక వ్యవస్థ అని వేరే చెప్పనవసరం లేదు. 2003 సంవత్సరానికి మెగసేసే అవార్డు గ్రహీత ఆచార్య శాంతాసిన్హా” అన్నట్లు బడిలో కాకుండా బాలలు ఎక్కడున్నా వారు బాల కార్మికులే” అన్న పలుకు దేశంలోని బాలల పరిస్థితిని స్పష్టం చేస్తుంది. లేలేత చిట్టిచేతుల చిన్నారి మొగ్గలు తల్లిదండ్రుల బీదరికం కారణంగా కుటుంబానికి ఆర్థికంగా మద్దతునివ్వడం కొరకు బాల కార్మికులుగా మారుతున్నారు. మన సమాజ నిర్మాతలైన బాలలు ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితులు పటిష్టంగా అమలు కాకపోవడమే ఈ విపత్కర పరిణామానికి తలుపులు తెరుస్తున్నాయి.
బాలల్లో సగానికి సగం కార్మికులే :
తాజా యునిసెఫ్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 24.6 కోట్లమంది చిన్నారులు బాల కార్మికులుగా మగ్గిపోతున్నారన్నది బ్రేకింగ్ న్యూస్ గా మారింది . ఇక మన దేశం మొత్తం జనాభాలో సుమారు47 కోట్లమంది పిల్లలే . ఇందులో దాదాపు సగంమంది ( ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది ) బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడి మానేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55%, షెడ్యూల్డ్ తెగల్లో 63% దాకా ఉందని అంచనా. బడి మానేసిన ప్రతి పిల్లవాడూ అనివార్యంగా బాలకార్మికుడిగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఫలితంగా బాలల అక్రమ రవాణాబాల్య వివాహాలులైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. బడి ఎరుగని బాలల్లో సుమారు 1.6 కోట్లకు పైగా చిన్నారులు బాలకార్మికులుగా వివిధ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2001 వ సంవత్సరంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం 6నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగివుండి బాల కార్మికులుగా పనిచేస్తున్న వారి సంఖ్య 1.26 కోట్లు . ఈ సంఖ్య బెల్జియం దేశ జనాభా కంటే ఎక్కువ. వాస్తవానికి అనేక సందర్భాల్లో బాలకార్మిక వ్యవస్థ ప్రభుత్వ లెక్కల్లోకి రాదని కూడా జాతీయ బాలల హక్కుల కమిషన్ పేర్కొందంటే బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వాలు ఎంత నిబద్దతతో పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. 2005 నాటికి జాతీయ బాలల కార్యాచరణలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ నిషేధంతోపాటు బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీఈ లక్ష్య సాధనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి .
బాలల హక్కులకు సంబందించిన భారత రాజ్యాంగ చట్టాలు :
చిన్నారుల పట్ల సమాజానికి బృహత్తర బాధ్యత ఉన్నదన్న విషయాన్ని భారత రాజ్యాంగం ఎప్పుడో నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని 24 వ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల లోపు బాల బాలికలను కర్మాగారాలుగనులు లాంటి ప్రమాదకర ప్రదేశాలలో కార్మికులుగా నియమించరాదు. అలాగేతివాచీల తయారీభవన నిర్మాణంఇటుక బట్టీలుపలకల తయారీక్వారీలు తదితర రంగాలతో పాటు 2010లో సర్కస్‌లలోఏనుగుల సంరక్షణలో కూడా బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుమును విధించడానికి సెక్షన్ 14 వీలు కల్పిస్తోంది. దీంట్లో జైలుశిక్ష విధించడానికి నిబంధనలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్రకేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలువాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి. 1975 సంవత్సరంలో వెట్టి చాకిరి నిరోధక బాలలకు రక్షణ కల్పిస్తూ భారతీయ శిక్షాస్మృతిలో ఐ.పి.సి. 361, ఐ.పి.సి 363-ఐ.పి.సి 366, బాలలకు రక్షణ కల్పించింది. అయితేఎన్ని చట్టాలు చేసినప్పటికీ బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో ప్రభుత్వాలు వెనుకంజలోనే ఉన్నాయన్నది నిర్వివాదాంశం.

పిల్లల పట్ల ప్రపంచం చూపించే ప్రేమానురాగాలువిశ్వాసాలకు మించిన పవిత్ర అంశం మరొకటి లేదు. పిల్లల హక్కులను పరిరక్షిస్తూఆ హక్కులను గౌరవిస్తూవారి సంక్షేమాన్ని రక్షిస్తూ పిల్లల జీవితాలు భయమన్నది ఎరుగకకొరతన్నది తెలియక శాంతియుతంగా ఎదిగేందుకు నిర్వర్తించే కర్తవ్యాన్ని మించిన కర్తవ్యం మరొకటి లేదు అని ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ శ్లాఘించిన విధంగా ఎప్పుడైతే ఆ చిన్నారుల హక్కులు పరిరక్షించబడతాయో అప్పుడే ప్రపంచ దేశాలు వర్ధిల్లుతాయి. 
బాల కార్మికవ్యవస్థ కర్కశానికి చిన్నారులు గురవుతున్నారనడానికి కొన్ని సాక్ష్యాలు :
·         ప్రపంచంలోని పేద దేశాల్లో ఉన్న ప్రతీ నలుగురు బాలల్లో ఒకరు బాలకార్మికులుగా మారి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారన్నది టాప్ న్యూస్ గా మారింది .
·         లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఒక్క వ్యవసాయ రంగంలోనే  సుమారు 60 % బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు.
·         బాలకార్మికులుగా పనిచేసే ప్రతీ ఐదుగురి చిన్నారుల్లో ఒక్కరు మాత్రమే పనికి తగ్గ వేతనాన్ని పొందుతున్నారు.
·         ఇథియోపియా దేశంలో సుమారు అరవై శాతం పిల్లలు అత్యంత ప్రమాదకరమైన మైనింగ్ ఇండస్ట్రీలో కార్మికులుగా పనిచేస్తున్నారు.  
·         కుటుంబానికి ఆసరాగా ఉండటానికి  పదిహేను ఏళ్ళు నిండకమునుపే సుమారు 30 శాతం మంది పేద దేశాలకు చెందిన  పిల్లలు  కార్మికులుగా మారుతున్నారు.

No comments:

Post a Comment