Wednesday 30 March 2016

ప్రియుడి గుండె కోసిన మహిళకు మరణశిక్ష



ఢాకా: తనను మోసం చేసిన ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది మహిళ. అందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రియుడికి నిద్ర మాత్రలు ఇచ్చి.. అనంతరం చేతులు, కాళ్లు కట్టేసి, గొంతు కోసి హతమార్చింది. తర్వాత అతి దారుణంగా అతడి గుండెను కోసి బయటకు తీసింది. ఇప్పుడా మహిళకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..
21 ఏళ్ల ఫతేమా అఖ్తర్ సోనాలి, 28 ఏళ్ల షిపాన్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే సోనాలిని పెళ్లి చేసుకునేందుకు షిపాన్ అంగీకరించలేదు. అంతేగాక, సోనాలితో, ఇతర మహిళలతో సన్నిహితంగా గడిపిన సన్నివేశాలను వీడియోలుగా తీసి మరీ అతను ల్యాప్టాప్లో భద్రపరుచుకున్నాడు. అవి చూసి షిపాన్ తనను మోసం చేశాడని ఆగ్రహానికి గురైన సోనాలి అతడిని చంపేందుకు సిద్ధపడింది. కూల్డ్రింక్లో నిద్రమాత్రలు ఇచ్చి షిపాన్తో తాగించింది. అనంతరం కిరాతకంగా హత్య చేసింది.
అయితే విచారణ సమయంలో సోనాలి చెప్పిన మాటలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అంతమంది అమ్మాయిల్ని ప్రేమించిన షిపాన్కి ఎంత పెద్ద గుండె ఉందో చూసేందుకే తానీ పనిచేశానని చెప్పింది. సోనాలి మాటలతో న్యాయస్థానం కంగుతింది. కేసులో ఆమెను దోషిగా పరిగణిస్తూ.. మరణశిక్ష విధించింది. సాధారణంగా బంగ్లాదేశ్లో మహిళలకు మరణశిక్ష విధించరు. అయితే కేసులో ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా శిక్షే ఖరారు చేస్తే.. బంగ్లాదేశ్లో మరణశిక్షకు గురైన తొలి మహిళ సోనాలియే అవుతుంది.

For telugu news paper please Download NewsDistill app from Google play store

No comments:

Post a Comment