Thursday 31 March 2016

కోల్‌కతాలో ఫ్లైఓవర్‌ కుప్పకూలి 17మంది మృతి , మృతుల సంఖ్య పెరిగే అవకాశం





పశ్చిమ్‌బంగ రాజధాని నగరం కోల్‌కతా ఉత్తర ప్రాంతంలోని గిరీష్‌ పార్క్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లైఓవర్‌ వంతెన కుప్పకూలడంతో 17 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శిథిలాల కింద 70 మందికిపైగా చిక్కుకున్నట్లు సమాచారం. పారామిలటరీ బలగాలు, స్థానిక ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. 2011 సంవత్సరంలోనూ నగరంలోని ఆల్టాడంగా ప్రాంతంలో బ్రిడ్జ్ కూలిన ఘటన లో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలుతీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలుస్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 2009 లో ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం ఎనిమిది సార్లు వాయిదా పడుతూ ఇప్పటికి కూడా పూర్తికాకపోవడం గమనార్హం. నాణ్యతా ప్రమాణాలు, పర్యవేక్షణ లేమి కారణంగానే ఘటన చోటుచేసుకుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
2007 లో హైదరాబాద్ నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న పంజాగుట్ట ఫ్లైఓవర్‌ కూలి ఇద్దరు మరణించడం విదితమే.

మరింత తెలుగు న్యూస్ కోసం న్యూస్ డిస్టిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లైవ్ తెలుగు న్యూస్ సమాచారం కోసం న్యూస్ డిస్టిల్ యాప్ కి మారండి.

No comments:

Post a Comment