Wednesday 30 March 2016

4,500 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చిన బోయింగ్



1916 సంవత్సరంలో ప్రారంభమై, 96.114 బిలియన్ డాలర్ల రెవెన్యూ వ్యాల్యూ కలిగి,  సుమారు ముప్పై దేశాలకు విశిష్ట సేవలను అందిస్తున్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్ కి సైతం నష్ట నివారణ చర్యలు తీసుకోక తప్పలేదు.
ఏడాదిలో 4,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బోయింగ్ సంస్థ ప్రకటించడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. పింక్ స్లిప్( తొలగింపు లిస్టు ) లో వందల మంది ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్ స్థాయి ఉద్యోగులు ఉండటం విశేషం. గతేడాది చివరికి బోయింగ్లో 1,61,000 పైగా సిబ్బంది ఉన్నారు. వారిలో 3శాతం ఉద్యోగులను ఇప్పుడు తొలగించనున్నారు. ఎయిర్బస్ నుండి విపరీతమైన పోటీ, కంపెనీ వ్యయం, బోయింగ్ విమానాలకు ముందటిలా ఆదరణ కరువవడం వలన కంపెనీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

మరింత తెలుగు న్యూస్ కోసం న్యూస్ డిస్టిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లైవ్ తెలుగు న్యూస్ సమాచారం కోసం న్యూస్ డిస్టిల్ యాప్ కి మారండి.

No comments:

Post a Comment