Tuesday 29 March 2016

యాపిల్ సెక్యురిటీ ఎంతవరకు ?



 యూఎస్ లోని శాన్ బెన్రార్డినో పై దాడి చేసిన సయ్యద్ ఫరూక్ ఐఫోన్ ను అన్ లాక్ చేసే విషయంలో యాపిల్ సంస్థకు యూఎస్ ఎఫ్బీఐ కి మధ్య భీకర వాదనలు జరిగిన విషయం తెలిసిందే. తీవ్రవాద మూలాల సమాచారాన్ని సేకరించుటకు సయ్యద్ ఫరూక్ ఐఫోన్ ను అన్ లాక్ చేయడం చాలా కీలకమని, దర్యాప్తును ముందుకు తీసుకుపోవడానికి అతని ఫోన్ సమాచారం అత్యవసరమని  ఎఫ్బీఐ వాదించింది. కానీ, అతని ఫోన్ ను అన్ లాక్ చేస్తేకస్టమర్లలో నమ్మకం కోల్పోయే ప్రమాదముందని యాపిల్ సంస్థ పని చేయడానికి  విముఖత వ్యక్తం చేసింది. తాజాగాఇజ్రాయిల్ కు చెందిన ఫోరెన్సిక్ కంపెనీ సాయంతో ఫరూక్ స్మార్ట్ ఫోన్ ను ఎఫ్బీఐ అధికారులు అన్ లాక్ చేసి అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారని యూఎస్ అటార్నీ ఎలీన్ డెకర్ తెలిపారు. ఫోన్ అన్ లాక్ కు సహకరిస్తేడిజిటల్ సెక్యూరిటీప్రైవసీ విభాగాల్లో అనుమానాలు తలెత్తుతాయని యాపిల్ చేసిన వాదనకు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్ఫేస్ బుక్ సైతం మద్దతు పలికాయి. అయితే.. ప్రైవసీ విషయంలో అన్నింటికి మించి ఉత్తమమైన సంస్థగా పేరుగాంచిన యాపిల్ ఫోన్ ను మామూలు కంపెనీ లు సైతం అన్ లాక్ చేయగలవని తెలిసి సంస్థ వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
కొసమెరుపేమంటే, డిజిటల్ సెక్యూరిటీ పేరుతో విచారణ ను అడ్డుకుంటున్నందుకు యాపిల్ సంస్థపై పెట్టిన కేసును ఎఫ్బీఐ ఉపసంహరించుకోవడం విశేషం.

No comments:

Post a Comment